calender_icon.png 22 October, 2025 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారు నగల కోసమే హత్య

22-10-2025 01:16:04 PM

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ఘాజీపూర్ గ్రామంలో ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఘాజీపూర్ గ్రామానికి చెందిన కురువ చంద్రమ్మ(73) కొడుకు, కోడలితో నివసిస్తుంది. గత మంగళవారం కొడుకు రాములు గ్రామంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లాడు కోడలు పొలం పనులకు వెళ్ళింది. మధ్యాహ్నం సమయంలో రక్తం గాయాలతో పడి ఉన్న చంద్రమను చూసి స్థానికులు కొడుకు, కోడలికి సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చికిత్స కోసం తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు గత రాత్రి చంద్రమ్మ మృతి చెందింది. అయితే వృద్ధురాలు చంద్రమ్మ ఒంటిపై ఉన్న బంగారు నగలు కనిపించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు బంగారు నగల కోసం హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.