calender_icon.png 22 October, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం..!

22-10-2025 01:23:08 PM

వర్షపు నీటి కాలువ పైకప్పు పది రోజుల్లోనే కూలిపోయింది

రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం, కాకతీయ నగర్ – జాతీయ రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్న క్రమంలో రహదారి ఇరువైపులా వర్షపు నీటి కాలువలు నిర్మిస్తున్నారు. అయితే నిర్మాణ నాణ్యతలో తీవ్రమైన లోపాలు బయటపడుతున్నాయి. ఇటీవల కాకతీయ నగర్ పరిధిలో కొత్తగా వేసిన కాలువ పైకప్పు పదిరోజులు కూడా గడవకముందే కూలిపోయింది.

స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, కాలువ నిర్మాణంలో నాసిరకం ఇనుము మరియు తక్కువ నాణ్యత గల సిమెంట్ వాడటం వల్లే పైకప్పు కూలిపోయిందని వెల్లడించారు. ఈ మార్గంలో నిత్యం వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగించే కారణంగా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా ఎర్ర జెండా కట్టి హెచ్చరికగా వదిలినా, వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే పెద్ద ప్రమాదం జరగవచ్చని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.