calender_icon.png 22 October, 2025 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాసంస్థలకు అండగా ఉంటాం: బండి సంజయ్

22-10-2025 12:36:29 PM

హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్‌మెయిల్ ప్రభుత్వంగా మారిపోయిందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) ఆరోపించారు. బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులతో బ్లాక్ మెయిల్ చేస్తారా.? విద్యార్థుల, యాజమాన్యాల భవిష్యత్ తో చెలగటమాడతారా..? బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కార్తీక మాసం సందర్భంగా కేంద్రమంత్రి నల్లకుంట శంకరమఠాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పై ప్రభుత్వ వైఖరి సరికాదని తెలిపారు. పెండింగ్ ఫీజులన్నీ చెల్లించేవరకు విద్యాసంస్థలకు అండగా ఉంటామని హమీ ఇచ్చారు. ప్రభుత్వ ఒత్తిడికి విద్యాసంస్థల యాజమాన్యాలు లొంగిపోవదని కోరారు. వాయిదా పద్దతుల్లో చెల్లింపులకు అంగీకరించవద్దని సూచించారు. విద్యాసంస్థల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తామని బండి సంజయ్(Bandi Sanjay Kumar) స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో(Congress Government) కమిషన్లు దందా నడుస్తోందన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోందన్నారు.

కమిషన్లను మంత్రులు ఏ విధంగా పంచుకుంటున్నారో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రుల హామీ ఇస్తే తూచా తప్పకుండా అమలు కావాలని కోరారు. రూ.10,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్లియర్ చేస్తామని మీరు హామీ ఇచ్చారన్న బండి సంజయ్ మాట నిలబెట్టుకోవాలన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలకు టోకెన్ అమౌంట్ కాదు.. పూర్తి బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీహార్ ఎన్నికలకు(Bihar Elections) తెలంగాణ నుండే డబ్బులు పంపుతున్నారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం పెండింగ్ బకాయిలు చెల్లించలేరా? తక్షణమే వాటిని చెల్లించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలంటే కొట్లాడే భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో(Jubilee Hills by-election) ఓట్లు వేసి బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు.