22-10-2025 11:49:27 AM
హైదరాబాద్: నారాయణగూడలోని వైఎంసీఏ గ్రౌండ్స్‌లో సదర్ ఉత్సవ్ మేళా( Sadar Utsav Mela) జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 22న రాత్రి 7:00 గంటల నుండి అక్టోబర్ 23న ఉదయం 4:00 గంటల వరకు హైదరాబాద్ పోలీసులు ఈ క్రింది ప్రదేశాల నుండి వాహనాలను(Traffic restrictions) మళ్లిస్తారు. రాంకోటి / లింగంపల్లి ఎక్స్ రోడ్ల నుండి వైఎంసీఏ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కాచిగూడ ఎక్స్ రోడ్ల వద్ద టూరిస్ట్ / సుల్తాన్ బజార్ వైపు మళ్లిస్తారు. విట్టల్‌వాడి ఎక్స్ రోడ్ల నుండి రాజ్‌మొహల్లా చిల్లా వైపు వెళ్లే ట్రాఫిక్‌ను పద్మశాలి భవన్ వద్ద రాంకోటి ఎక్స్ రోడ్ల వైపు మళ్లిస్తారు. అదేవిధంగా, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ / స్మశానవాటిక నుండి వైఎంసీఏ వైపు వచ్చే ట్రాఫిక్‌ను విట్టల్‌వాడి ఎక్స్ రోడ్ల వద్ద రాంకోటి ఎక్స్ రోడ్లు, ఆర్టీసీ ఎక్స్ రోడ్లు / క్రౌన్ కేఫ్ వైపు, నారాయణగూడ ఎక్స్ రోడ్ల వద్ద హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు మళ్లిస్తారు.
నారాయణగూడ ఎక్స్ రోడ్స్ నుండి ఆర్‌బివిఆర్‌ఆర్ కళాశాల వైపు వచ్చే ట్రాఫిక్‌ను బాబా టెంట్ హౌస్ వద్ద క్రౌన్ కేఫ్ బాగ్ లింగంపల్లి కాలనీ వైపు, రెడ్డి కళాశాల జంక్షన్ వద్ద బాబా టెంట్ హౌస్ వైపు మళ్లిస్తారు. బర్కత్‌పురా చమన్ నుండి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలను పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వద్ద క్రౌన్ కేఫ్ క్రౌన్ కేఫ్ → లింగంపల్లి ఎక్స్ రోడ్స్ వైపు, పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వద్ద బర్కత్‌పురా చమన్ వైపు మళ్లిస్తారు. లింగంపల్లి ఎక్స్ రోడ్లు / లింగంపల్లి కాలనీ నుండి ఆర్బీవీఆర్ఆర్(RBVRR) కళాశాల వైపు వచ్చే ట్రాఫిక్‌ను మాతా టెంపుల్ వద్ద పోస్టాఫీస్ జంక్షన్ కాచిగూడ ఎక్స్ రోడ్ల వైపు పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వైపు, లింగంపల్లి ఎక్స్ రోడ్ల వద్ద బర్కత్‌పురా చమన్ మీదుగా టూరిస్ట్ జంక్షన్ వైపు మళ్లిస్తారు. టూరిస్ట్ జంక్షన్ నుండి లింగంపల్లి ఎక్స్ రోడ్స్ వైపు వాహనాలను అనుమతించరు. బర్కత్‌పురా చమన్ వైపు మళ్లిస్తారు.
ఆర్టీసీ బస్సుల మళ్లింపులు
సికింద్రాబాద్, కోటి మధ్య నడిచే ఆర్టీసీ బస్సులు(RTC buses) వైఎంసీఏ సర్కిల్, నారాయణగూడ ఎక్స్ రోడ్ల మీదుగా వెళ్లకుండా ఉండాలి. బర్కత్‌పురా నుండి పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వైపు బాగ్ లింగంపల్లి నుండి బీఎస్టీ నుండి ఆర్టీసీ ఎక్స్ రోడ్ల వరకు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్ళాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. సదర్ మేళా సందర్శకులు తమ వాహనాలను కేశవ్ మెమోరియల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో పార్క్ చేయవచ్చు. ఇది 400 ద్విచక్ర వాహనాలు, 400 నాలుగు చక్రాల వాహనాల సామర్థ్యం కలిగి ఉంటుంది. ట్రాఫిక్ అప్ డేట్స్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ఎక్స్ ఖాతా, అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ద్వారా సంప్రదించండి.