22-10-2025 01:07:26 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్ -14 హ్యాండ్ బాల్ (HAND BALL) బాల, బాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీలను పట్టణంలోని ట్రినిటీ హై స్కూల్ (TRINITY HIGH SCHOOL)లో బుధ వారం పోటీల కన్వీనర్, పాఠశాల కరెస్పాండెంట్ బిజు కురువిల్లా క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. ఈ ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 150 మంది క్రీడా కారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమీ డైరెక్టర్ జాన్ థామస్, జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ (SGF SECRETARY) ఎండీ యాకూబ్ (MD YAKUB), నిర్వాహక కార్యదర్శులు జునుగు రవి (PET), రవీందర్ (PET), సౌమిత్ (PET), వ్యాయామ ఉపాధ్యాయులు పాశం శ్రీనివాస్, పున్నం, విఠల్, సాంబమూర్తి, కార్తీక్, రాజేందర్, వామన్, విశాల, దీపిక, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.