22-10-2025 12:27:45 AM
ములుగు,అక్టోబరు21(విజయక్రాంతి): ములుగు జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. మంగళవారం, నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు సభ్యులు.. మాడవి కోసి, మాడవి ఇడుమే, మచ్చకి దేవా, మడకం బండి, ములుగు జి ల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఎదుట లొంగిపోయారు.లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు ఎస్పీ శబరీష్ తక్షణ సహాయంగా రూ.25, 000 అందించారు. అజ్ఞాత జీవితాన్ని విడిచిపెట్టి, పోలీసులను సంప్రదించే మావో యిస్టులకు ఎటువంటి హాని ఉండదని ఎస్పీ స్పష్టం చేశారు.