01-08-2025 01:20:25 AM
-సిస్ట్రా గ్లోబల్ డిజిటల్ టూల్స్ సెంటర్ ప్రారంభోత్సవ సభలో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో నీటి పారుదల ప్రాజెక్టు లను నిర్మిస్తుందని నీటి పారుదల శాఖ మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత మెట్రో డిజైన్, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సంస్థ అయిన ఫ్రాన్స్‌కు చెందిన సిస్ట్రా కార్యాలయాన్ని (సిస్ట్రా గ్లోబల్ డిజిటల్ టూల్స్ సెంటర్) గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిస్ట్రా సంస్థ గత సంవత్సరం 1.25 యూరో బిలియన్‌ల ఆదాయం గడించిందన్నారు. భారతదేశంలోని 80 శాతం మెట్రో ప్రాజెక్టులు ఈ సంస్థ రూపొందించినవేనన్నారు. సిస్ట్రా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, వైమానిక దళంలో పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నప్పుడు ఫ్రెం చ్ ఇంజినీరింగ్ వర్క్ కల్చర్‌ను స్వయంగా చూసినట్టు గుర్తు చేశారు.
ఫ్రాన్స్ వెళ్లడం తనకెప్పుడు ఆనందదాయకమేనని, ఫ్రాన్స్‌కు చెందిన సిస్ట్రా సంస్థ హైదరాబాద్‌లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిస్ట్రా ఇండియా సీఈవో హరి తదితరులు పాల్గొన్నారు.