02-08-2025 02:00:38 AM
సంగారెడ్డి, ఆగస్టు 1 (విజయక్రాంతి): దేశంలో సామాజిక న్యాయం జరగాలన్నది రాహుల్‌గాంధీ మోడల్ అని, తెలంగాణలో అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పాటుపడుతున్నారని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో పీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన జనహిత పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. నియోజక వర్గంలోని సంగుపేట నుంచి జోగిపేట వరకు ఆరు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు.
సంగుపేట చౌరస్తాలో మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌కు మం త్రి దామోదర్ రాజనర్సింహ స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం జోగిపేటలోని హనుమాన్ జంక్షన్ వద్ద కార్నర్ మీ టింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మీ నాక్షి నటరాజన్ మాట్లాడుతూ కొందరు స్వా ర్థ ప్రయోజనాల కోసం దేశంలో ఓట్లు తొలగిస్తున్నారన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలు రాహు ల్‌గాంధీ మార్గదర్శకాలతో ముందుకు అడు గు వేస్తున్నారన్నారు.అదానీ, అంబానీ కోస మే మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు.
బనకచర్ల పాపం కేసీఆర్, హరీశ్‌రావుదే: మహేశ్‌కుమార్‌గౌడ్
బనకచర్ల ప్రాజెక్టు పాపం కేసీఆర్, హరీశ్‌రావుదేనని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ దుయ్యబట్టారు. ఆనాడు వారు సంతకాలు పెట్టడం వల్లనే ఆంధ్రలో బనకచర్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. తెలంగాణ నీటిని ఆం ధ్రకు అమ్మివేశారని ఆరోపించారు. వాటిని సీఎం రేవంత్‌రెడ్డి వెనక్కి తీసుకువస్తున్నాడని తెలిపారు. హరీశ్ నోరు విప్పితే అన్నీ అబద్ధాలేనని అన్నారు. పాపాలు పెరిగిపోయి కేసీ ఆర్ ఫాంహౌజ్‌కు పరిమితమయ్యారని, ప్ర జాపాలన అందించే కాంగ్రెస్‌కు ప్రజలు ప ట్టం కట్టారని తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీకి మా త్రమే ఉద్యోగాలు వచ్చాయని విమర్శించా రు. ఎమ్మెల్సీ కవిత ఏ పార్టీలో ఉందో చెప్పాలన్నారు. 42శాతం బీసీ రిజిర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే ఈరోజు కవిత రంగులు పూ సుకుంటుందన్నారు. బీసీ డిక్లరేషన్ కోసం అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఓటేసి కేం ద్రంలో మోసం చేస్తుందని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కొట్లాడి 42 శాతం బీసీ రిజర్వేషన్ ఖరారు చేయిస్తామన్నారు. ఎన్నికలప్పుడు బీజేపీ దేవుని పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటుందని మండిపడ్డారు. పీ సీసీ చేపట్టిన జనహిత పాదయాత్ర జనాల తో మమేకమవ్వడానికేనని, ఓట్ల కోసం చేపట్టిన పాదయాత్ర కాదన్నారు. వచ్చే అ సెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు సాధిస్తా మన్నారు.
కాంగ్రెస్‌ది సమాజ హితమే: దామోదర
మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ సమాజ హితం కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రాహుల్ గాం ధీ నినదించిన నఫ్రత్ చోడో.. భారత్ జోడో అనే నినాదం స్పూర్తినిచ్చిందన్నారు. మాటి స్తే నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో అందోల్ నుంచి పాదయా త్ర చేపట్టారని, రాహుల్‌గాంధీ జోడో యా త్ర.. నేడు మీనాక్షి నటరాజన్ జనహిత యా త్ర ఇక్కడి నుంచే ప్రారంభించారని తెలిపా రు.
అందోల్ గడ్డకు చరిత్ర ఉన్నదని, 67 ఏళ్లుగా తమ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ కాపాడుతుందని గుర్తు చేశా రు. అనేక సంక్షేమ పథకాలు అందోల్ ని యోజకవర్గంలో ఎన్నడూ లేనివిధంగా కాం గ్రెస్ ప్రభుత్వంలో మంజూరయ్యాయని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ మాట్లా డుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సం క్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడు తూ అధికారంలో ఉండగా పాదయాత్ర చే స్తారా అని కొందరు అంటున్నారని, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం మేము కష్టపడుతునే ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, నాయకులు కాట శ్రీనివాస్‌గౌడ్, త్రిష రాజనర్సింహ, ఆంజనేయులుగౌడ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.