calender_icon.png 1 August, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేత

01-08-2025 01:21:07 AM

ఎమ్మెల్యే బాలు నాయక్

దేవరకొండ, జూలై 31: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని సాయి కృప ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆహార భద్రత కార్డుల మంజూరు పత్రాలను గురువారం  దేవరకొండ ఎమ్మెల్యే  నేనావత్ బాలు నాయక్ లబ్ధిదారులకుఅందజేశారు.

గత పాలకులు పదేళ్లలో ఒక్క రేషన్ కార్డులు మంజూరు చేయకుండా, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెట్టిందని, ప్రజా ప్రభుత్వంలో ఇచ్చిన మాట మేరకు రేషన్ కార్డులు ఇవ్వడమే గాక రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు