calender_icon.png 2 August, 2025 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యునిగా పేరబోయిన మహేందర్

01-08-2025 01:19:16 AM

యాదగిరిగుట్ట జులై 31 విజయక్రాంతి: వలిగొండలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) యాదాద్రి భువనగిరి జిల్లా 4వ మహాసభలో పేరబోయిన మహేందర్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు గతంలో సిపిఐ సంబంధించిన విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్  ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులుగా ప్రస్తుతం అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఈనెల 29న జరిగిన జిల్లా మహాసభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎన్నిక య్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి జిల్లాలో ప్రజా సమస్యల పరి ష్కారానికి పోరాటాలు నిర్వహిస్తామన్నారు సిపిఐ పార్టీ బలపడడానికి నావంతు చేస్తానన్నారు ఎన్నికకు సహకరించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోదా శ్రీరాములు జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.