calender_icon.png 2 August, 2025 | 3:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్యాణ లక్ష్మి కాసులకు కక్కుర్తి

02-08-2025 08:21:23 AM

ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన భూత్పూర్ ఆర్ఐ సుబ్రహ్మణ్యంగౌడ్ 

భూత్పూర్: పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ్ లక్ష్మి సహాయం అందించాలంటే కొంత మొత్తం చెల్లించుకోవాల్సిందే అంటూ బూత్పూర్ ఆర్ఐ బాలసుబ్రమణ్యం గౌడ్(Bhoothpur RI Subrahmanyam Goud) కాసులకు కక్కుర్తి పడ్డారు. ఈ అంశం కు సంబంధించి ఏసీబీ(Anti-Corruption Bureau) డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మికి సంబంధించి తదుపరి ప్రక్రియ కొనసాగాలంటే రూ 8000 చెల్లించాల్సిందే అంటూ సుబ్రహ్మణ్యం గౌడ్ ఓ వ్యక్తి ని డిమాండ్ చేశారు.

దీంతో ఒప్పందం మేరకు ముందుగా రూ 4 వేలు అందించేందుకు సదరు వ్యక్తి శుక్రవారం తాసిల్దార్ కార్యాలయానికి ఏసీబీ అధికారుల సూచన మేరకు వచ్చేశారు. సుబ్రహ్మణ్యంగౌడ్ డబ్బులు తీసుకున్న వెంటనే ఏసిబి అధికారులు నేరుగా పట్టుకొని విచారణ చేశారు. ఆర్ ఐ(Revenue Inspector) తీసుకున్న నగదును కెమికల్ పరీక్షల ద్వారా నిర్ధారణ చేసి కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ అనంతరం ఆర్ఐ ను జిల్లా కేంద్రంలోని ఏసీబీ కార్యాలయానికి ఆర్ ఐ ని తరలించారు. ఉన్నట్టుండి భూత్పూర్ తాసిల్దార్ కార్యాలయానికి ఏసిబి అధికారులు రంగ ప్రవేశం చేయడంతో తాసిల్దార్ కార్యాలయంలో అధికారులకు ఒక్కసారిగా సైలెంట్ వాతావరణం కనిపించింది.