26 August, 2026 | 10:07 AM

చిచ్చు పెట్టిన సీసీ రోడ్డు నిర్మాణం

14-03-2025 01:49 AM

రోడ్డు విషయంలో తలెత్తిన వివాదం

కత్తులు, గొడ్డలితో పరస్పర దాడులు

ముగ్గురికి గాయాలు ఆస్పత్రికి తరలింపు

పెద్ద కొడప్గల్, మార్చ్ 13 (విజయ క్రాంతి), సీసీ రోడ్డు నిర్మాణం ఇరువర్గాల మధ్య చిచ్చు పెట్టింది. చివరికి ఇరు వర్గాలు ఘర్షణ పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని పలువురు ప్రజలకు ఉపయోగపడేందుకు నిర్మిస్తున్న సిసి రోడ్డు ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది  సీసీ రోడ్డు నిర్మాణం పై ఇరువర్గాల వారు పరస్పరం దాడులకు దిగారు. 

కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని జగన్నాథ్ పల్లి గ్రామంలో నూతన,సిసి, రోడ్డు నిర్మాణ విషయంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు.  ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం పెరిగి పెద్దదై చివరికి పరస్పరం ఇటుకలతో కత్తులతో గొడ్డలితో దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి ముగ్గురికి చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు ఒకరికి సీరియస్ గా ఉండడం వలన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగన్నాథ్ పల్లి గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.