16 April, 2026 | 11:40 AM

భవన నిర్మాణ కార్మికుల బీమా పెంపు

25-11-2025 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, నవంబర్ 24 : భవన, ఇతర నిర్మాణ కార్మికులకు సంబంధించిన బీమా పెంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో మంచిర్యాల ఆర్డిఓ శ్రీనివాస్ రావు, సహాయ కార్మిక కమిషనర్ పి.నరసింహస్వామి, అధికారులతో కలిసి బీమా పెంపు సంబంధిత గోడ ప్రతులు, కరపత్రాలను విడుదల చేశా రు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికులకు సంబంధించిన ప్రమా ద బీమా క్రింద లబ్ధి మొత్తాన్ని 6 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని, సహజ మరణం క్రింద లబ్ది మొత్తాన్ని 1 లక్ష రూపాయల నుండి 2 లక్షల రూపాయల వరకు పెంచ డం జరిగిందని తెలిపారు. డిసెంబర్ 3వ తేదీ వరకు మంచిర్యాల సహాయ కార్మిక శాఖ అధికారులు మండలాల వారీ గా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి కార్మికు లకు ప్రమాద బీమా ఆవశ్యకతపై వివరించడం జరుగుతుందని తెలిపారు.

అర్హులైన కార్మికులు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రమాద వశాత్తు పూర్తి శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహా యం, ప్రమాదవశాత్తు పాక్షిక శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి 4 లక్షల రూపాయల ఆర్థిక సహా యం అందించడం జరుగుతుందని తెలిపారు. వివరాల కొరకు సహాయ కార్మిక అధికారి కార్యాలయాలను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక అధికారి సత్యనారాయణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.