24-11-2025 10:35:04 PM
కోదాడ: కోదాడ మండల పరిధిలోని భీక్య తండా గ్రామంలో సోమవారం ఇందిరా గాంధీ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భీక్య తండా మాజీ సర్పంచ్ బానోతు అంబేద్కర్, మహిళా సమైక్య అధ్యక్షురాలు బానోతు మంజుల పాల్గొని గ్రామ మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. కార్యక్రమానికి గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి పండుగ వాతావరణాన్ని తీసుకువస్తుందని, ప్రభుత్వ చీరల పంపిణీ మహిళలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. గ్రామ పెద్దలు, మహిళా సంఘ సభ్యులు, యువతీ మిత్రబృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.