16 April, 2026 | 10:13 AM

సొంతింటి కల నిజం చేసిన సర్కార్

25-11-2025 12:00 AM
  1. మహిళా శక్తీ కరణే లక్ష్యంగా సంక్షేమ పథకాల అమలు

ఆదిలాబాద్‌లో ఏయిర్‌పోర్ట్ నిర్మాణ పనులను వేగవంతం

ఎంపీ, ఎమ్మెల్యే లతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు, చీరల పంపిణీ చేసిన మంత్రి

ఆదిలాబాద్, బోథ్, భైంసా, నవంబర్ 24 (విజయక్రాంతి) : పేద ప్రజలు కనే సొంతింటి కల ను నిజం చేస్తూ, ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం చేస్తూ వారికి అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని ప్రకటించారు. సోమవారం ఆదిలా బాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు.

ఆదిలాబాద్, బోథ్‌లో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్ర మంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే లు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడమ బొజ్జు పటేల్ లతో కలిసి పాల్గొన్న మంత్రి లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేసారు. అదేవిధంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద కుటుంబాలకు గృహం కల్పిం చడం రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇండ్లు నిర్మించి అంది స్తామని భరోసా ఇచ్చారు.

ఇందిరా గాంధీ కాలం నుంచే పేదల గృహ హక్కుల కోసం ప్రభుత్వాలు పని చేస్తున్నాయి,  ఈ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తామని మంత్రి అన్నా రు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ బోజరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య,  బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, శ్యామల దేవి, ఐటిడిఏ పీవో యువరాజ్, డీఆర్డీఓ రవీందర్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

బైంసాలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ

రాష్ట్రంలో అధికారులు ఉన్న కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం మహిళల్లో ఆత్మగౌరవం పెంచే విధంగా ఆరు గ్యారెంటీ పథకా లతో పాటు అనేక పథకాలను అమలు చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మం త్రి జిల్లా ఇన్చార్జి జూపల్లి కృష్ణారావు అన్నా రు. సోమవారం రాత్రి బైంసా పట్టణంలో ప్రభుత్వ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో తమ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నాగేష్ ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్, అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.