15 May, 2026 | 6:55 AM

అగ్ని ప్రమాద బాధితురాలికి అండగా ఉంటా

11-08-2025 12:11 AM

గ్రామంలో బాధితురాలు శాంతాబాయికి పరామర్శ 

కుభీర్:  కుభీర్ మండలంలోని చాత గ్రామంలో గత నెలలో విద్యుత్ షాట్ సర్క్యూట్ తో పూజారి శాంతాబాయి అనే నిరుపేద వ్యవసాయ కూలీకి చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు కాలి బూడిదయింది.  ప్రమాదం జరిగిన సమయంలో శాంతాబాయి బైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేసుకొని చికిత్స పొందుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇరుగు పొరుగువారు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో సిబ్బంది శకటంతో వచ్చి మంటలను అర్పినప్పటికీ అందులోని ఏ ఒక్క వస్తువు కూడా మిగలకుండా కాలి బూడిద అయ్యాయి. దీంతో కట్టుబట్టలతో కుటుంబం వీధిపాలైంది.

అప్పటినుండి ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినప్పటికీ ఆ పేద కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం గాని భరోసా కానీ లభించలేదు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రమాదానికి సంబంధించిన వీడియోలను చూసిన భైంసా పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బోస్లే మోహన్ రావు పటేల్ స్పందించి ఆదివారం గ్రామానికి చేరుకుని శాంతాబాయిని పరామర్శించారు. తన ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో సరుకులు నగదును అందించి వారం రోజులు తిరగకముందే రేకులతో కొట్టిన ఇళ్లు ను నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోగా ప్రజా ప్రతినిధులు పట్టించుకోక పోవడంతో బజారున పడ్డ శాంతాబాయి కుటుంబానికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆయన్ను అభినందించారు.