calender_icon.png 11 August, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వింత మొక్కు!?

11-08-2025 12:10:42 AM

అమ్మకు బలి కోసం..బంగారు కోడిపుంజు, అందంగా ముస్తాబు..

 మహబూబాబాద్, విజయ క్రాంతి; ఏడాది కాలం పాటు తనను, తన కుటుంబాన్ని చల్లగా చూడాలంటూ ముత్యాలమ్మ తల్లికి ఓ వ్యక్తి కోడిపుంజును బలిస్తుంటాడు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా..? అయితే ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణానికి చెందిన తోడేటి వెంకన్న అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా ముత్యాలమ్మ బోనాల పండుగ సందర్భంగా కోడిని బలివ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. అయితే అతను ఇందు కోసం ఏడాది కాలం పాటు ఇంటి వద్ద పెంచిన కోడి చెవులకు చెవి దిద్దులు అమర్చి, మద్యం సీసా, పూలదండతో సుందరంగా తీర్చిదిద్ది, డోలు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించి ముత్యాలమ్మకు దేవాలయానికి చేరుకొని అక్కడ అమ్మవారికి బలిచ్చి మొక్కు తీర్చుకున్నాడు.