calender_icon.png 14 August, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండ సురేశ్‌కు శ్రీగిడుగు రామమూర్తి పురస్కారం

11-08-2025 12:11:42 AM

భీమదేవరపల్లి, ఆగస్టు10 (విజయ క్రాంతి) హనుమకొండ  జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన నల్లగొండ సురేష్ కు శ్రీ గిడుగు రామమూర్తి పురస్కారం భవాని సాహిత్య సేవాసమితి అధ్యక్షులు వైరాగ్యం ప్రభాకర్ చేతుల మీదుగా అందజేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొప్పూర్ గ్రామానికి చెందిన.

నల్లగొండ సురేేశ్ కు సాహిత్య సేవను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ.తెలుగు భాషా దినోత్సవం జాతీయ శతాధిక కవి సమ్మేళనం పురస్కరించుకొని కరీంనగర్ లోని ఫిలింభవన్ లో జరిగిన సమావేశంలో తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ సీఈవో డా. ఉలవలపూడి వేంకట రత్నం,జాతీయ కమిటీ  జాతీయ ప్రోగ్రామ్ డైరెక్టర్ డా.ధనాశి ఉషారాణి ,భవావి సాహిత్య సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వైరాగ్యం ప్రభాకర్ చేతుల మీదుగా శ్రీ గిడుగు రామమూర్తి పురస్కారాన్ని నల్లగొండ సురేేశ్ కు అందజేశారు. నల్లగొండ సురేేశ్,నవయుగ శతకం,దశధీరులు కావ్యఖండికతో పాటు అనేక సంద ర్భానుసార పద్యాలు రాసారు.

ఆయన రాసిన రచనలు అనేక సంకలనాలలో అచ్చయ్యాయి. పద్య కవిత్వ కార్యశాల అనే వాట్సాప్ సమూహం ద్వారా కొత్తగా పద్య రచన చేస్తున్న వారికి సలహాలు,సూచనలు  అందిస్తూ తర్పీదునిస్తున్నారు. ఆయన ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. అవార్డు అందుకున్న  సందర్భంగా కొప్పూర్ గ్రామ పెద్దలు,ప్రజలు తన తోటి ఉపాధ్యాయులు అభినందించారు.