13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఆవులను తరలిస్తున్న కంటైనర్ల పట్టివేత

28-03-2026 01:36 AM

పట్టుకున్న భజరంగ్ దళ్ హిందూ వాహిని సభ్యులు

రెండు కంటైనర్‌లో 48 ఆవులు తరలింపు..

షాద్ నగర్, మార్చి 27 (విజయక్రాంతి): షాద్ నగర్ పట్టణంలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న రెండు కంటైనర్లను  భజరంగ్ దళ్, హిందు వాహిని  సభ్యులు పట్టుకున్నారు. పట్టుకున్న కంటైనర్లలోని ఆవులను  చౌడమ్మ గుట్ట  గోశాలకు తరలించారు.  అక్రమంగా భారీ కంటైనర్లలో  గురువారం రాత్రి తరలిస్తున్న ఆవులను షాద్ నగర్ హిందు వాహిని సభ్యులు పట్టుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా  తోరణాలను కడుతున్న  హిందు వాహిని, బజరంగ్దళ్  సభ్యులకు మూడు  కంటైనర్లు అనుమానాస్పదంగా అగుపించాయి.

వీరిని చూసిన కంటైనర్ డ్రైవర్లు వాహనాలను ఆపకుండా వెళ్లడంతో భజరంగ్ దళ్, హిందు వాహిని  సభ్యులు కంటైనర్లను వెంబడించి రెండు కంటైనర్లను పట్టుకున్నారు. కంటైనర్లలో తరలిస్తున్న 48 ఆవులను మున్సిపాలిటీలోని  చౌడమ్మ గుట్ట గోశాలకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం యువకులు పెద్ద ఎత్తున చౌడమ్మ గుట్ట గోశాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దీంతో షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ ఇరువర్గాలను చెదరగొట్టారు.