10-12-2025 01:45:52 AM
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): నేటికీ ప్రజలు బిఆర్‌ఎస్ కే మద్దతు తెలుపుతున్నారని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. కెరామేరి మండలం గోయెగావ్, కొఠారి కామాలు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి కోవలక్ష్మి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మా ట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఆయన చేసిన అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు నేటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ మద్దతుదారులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోములే అన్నారావు, సోనులే బాపు, నగోషా పాండు, గూర్నూలే నారాయణ, పర్ది వాసు, మోర్లే జ్ఞానేశ్వర్, సిడం భీమ్రావు, సిడం దేవ్షిండ్ దినేష్, జి. నిఖిల్, బాపూజీ, అతీఫ్ తదితరులు పాల్గొన్నారు.