26 July, 2026 | 2:13 AM

అధునాతన సీసీ కెమెరాలతో నిరంతర నిఘా

26-07-2026 12:00 AM

సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి

సికింద్రాబాద్,జూలై 25 (విజయక్రాంతి): ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర నిర్వహణపై శనివారం మహంకాళి పోలీస్ స్టేషన్ లో సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, అడిషనల్ డిసిపి నరసయ్య, ఏసిపి సిహెచ్ శ్రీధర్ కలిసి మీడియాతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిసిపి రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సికింద్రాబాద్ బోనాల జాతరను ప్రశాంత వాతావరణంలో పూర్తి చే యడంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమ ని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం అదనపు పోలీసు బలగాలను మోహరించాలని, ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాం తాల్లో అధునాతన సీసీ కెమెరాల తో నిరంతర నిఘా,కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేస్తూ, 10 క్రైమ్ టీమ్స్ తో ఈ నెల 31 నుండి విధులలో ఉంటారు.

ఆగస్టు 2, 3 తేదీల్లో ఫలహార బండ్ల ఊరేగింపులు ముగిసే వరకు వాహనదారులకు ఇ బ్బంది లేకుండా పకడ్బందీ ట్రాఫిక్  పోలీసు లుతో కలసి చర్యలు  తీసుకుంటున్నామని, ఈవ్ టీజింగ్, జేబుదొంగతనాలు జరగకుం డా షీ టీమ్స్, మఫ్టీ లో పోలీసులతో అలాగే ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలతో ఇన్, అవుట్ ప్రదేశాల్లో అనుమానితంగా కనిపించిన వ్య క్తులను అదుపులోని తీసుకుంటారు. వీఐపీ లు వచ్చే సందర్బంలోను సాధారణ ప్రజలను ఆపకుండా దర్శనం కల్పిస్తాం.

సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తాం.. 

జోగినిల కోసం  ప్రత్యేకంగా లైన్ ఏర్పా టు చేసి బాట రోడ్ నుండి అనుమతి ఇస్తామని,  అలాగే బోనాల తో వచ్చే మహిళల కోసం రెండు లైన్స్,ఒకటి బాట నుండి మరొకటి రోచ బజారు నుండి ప్రారంభం అవు తుంది. సాధారణ ప్రజల కోసం రెండు జనరల్ లైన్స్ ఏర్పాటు తో పాటు పాస్ ఉన్న వాళ్ళకి మరో రెండు లైన్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

రంగం రోజు స్వర్ణలత కోసం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసి,దర్శనం కో సం వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందు లు లేకుండా తక్కువ  సమయంలో దర్శనం పూర్తి అయ్యేలా ఏర్పాటు చేస్తున్నట్లుగా డిసి పి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా 2500 మంది పోలీసులతో గతం కన్నా ఎక్కువగా ఏర్పాట్లు చేస్తున్నామని డిసిపి రక్షిత కృష్ణమూర్తి తెలియజేశారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ లు రంగారెడ్డి, రవికుమార్, సురేష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.