13-12-2025 08:05:55 AM
కోరం ఉన్నప్పటికీ ఎన్నిక ప్రక్రియ వాయిదా వేశారని ఆరోపణ
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా తాడూరు గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్లో అయిదుగురు, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్లో ఐదుగురు వార్డు సభ్యులు గెలుపొందగా మరో ఇద్దరు ఇండిపెండెంట్ వ్యక్తులు విజయం సాధించాగా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. మర్నాడు శుక్రవారం మధ్యాహ్నం ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియ ఉంటుందని అధికారులు తెలిపారు.
కానీ రెండు ప్రధాన పార్టీలకు సరైన కోరం లేకపోవడంతో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లుగా బిఆర్ఎస్ బలపరిచిన వార్డు సభ్యులు ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను పూర్తిచేయాలని పట్టుపట్టారు. ఈ క్రమంలో సమయం దాటిపోయిందని వాయిదా వేశారు. కోరం ఉన్నా బిఆర్ఎస్ వార్డు సభ్యులకు డిప్యూటీ సర్పంచ్ ఎన్నిక పూర్తిచేయడం లేదని నిరసిస్తూ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని పట్టు పట్టారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని బుజ్జగించి ఉన్నతాధికారుల సూచన మేరకు ప్రక్రియ కొనసాగుతుందని సూచించారు.