13-12-2025 07:58:02 AM
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం ఎంపట్టి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు ఎన్నికల అనంతరం గెలుపొందిన సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య సీనియర్ టిఆర్ఎస్ నాయకులతో కలిసి తిరుమలగిరి క్యాంపు కార్యాలయంలో, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కు శాలువాతో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తాటికొండ సీతయ్య, తునికి సాయిల్ గౌడ్, మాజీ సర్పంచ్ కొండగల్పుల నాగయ్య, దేశ బోయిన హరీష్ యాదవ్, తునికి లక్ష్మమ్మ,, గానుగుబండ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.