13-12-2025 01:51:26 AM
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి) : పంచాయతీ ఎన్నికల మొదటి విడ త ఫలితాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల గ్రామీణ ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను స్పష్టంగా బయటపెట్టాయని బీఆర్‌ఎస్ ఎ మ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. శుక్రవా రం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. మొత్తం సాధారణంగా అధికార పార్టీకే 90 శాతం వరకు అనుకూలత ఉండే పరిస్థితుల్లో కూడా బీఆర్‌ఎస్ 1,345 సర్పం స్థానాలు గెలవడం కాంగ్రెస్‌కు ప్రజలు జారీ చేసిన మొదటి భారీ హెచ్చరిక అని వ్యాఖ్యానించారు.
రేవం త్ రెడ్డి కోతల నాటకానికి, వారి కోటరి ప్రలోభాలకు గ్రామీణ ఓటర్లు గట్టి వాత పెట్టారని, బీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ ఒత్తిళ్లను, డబ్బు రాజకీయాలను తట్టుకుని నిలబడటం ప్రజాస్వామ్యానికి ధృవపత్రమని అభినందిం చారు. సీఎం ఊరు కొండారెడ్డిపల్లి పక్కనే ఉన్న పోల్కంపల్లిలో కూడా కాంగ్రెస్ ఓటమి పాలవ్వడం, సీతక్క నియోజకవర్గం ఏటూరు నాగారంలో బీఆర్‌ఎస్ గెలవడం, మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీనా యక్ వదిన ఓడిపోయి ఓటర్లకు ఇచ్చిన డబ్బులు తిరిగి రాబట్టుకునే దుస్థితి రావడం వంటివి కాంగ్రెస్‌పై ప్రజల్లో ఎంత తీవ్రమైన అసహనం పెరిగిందో నిరూపిస్తున్నాయన్నారు.
హామీలు అమలు చేయడానికి డబ్బు లేదు అని చెప్పే రేవంత్ రెడ్డి, దేశంలోనే అ త్యంత ధనవంతుడైన సీఎంగా ఎదిగి, జల్సా కార్యక్రమాలు, మ్యాచ్‌లు, ఇమేజ్ మేకింగ్ షోల కోసం వందల కోట్లు వెచ్చించడాన్ని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో గమనిస్తున్నారని తెలిపారు. రెండో, మూడో విడతల్లో ఈ వ్యతిరేకత మరింత పెరిగి బయటపడుతుందని, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ధైర్యంగా, సంఘటితంగా ముందుకు సాగి రాబోయే రెండు విడతల ఎన్నికల్లో ప్రజా తీర్పును మరింత బలపరచాలని పిలుపునిచ్చారు.