28 August, 2026 | 2:29 PM

Breaking News

ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు   •   రాఖీ కట్టేందుకు వెళ్తుండగా ప్రమాదం.. మహిళకు తీవ్రగాయాలు   •   ప్రధాని మోదీ, తల్లిదండ్రులపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్ట్   •   ఎమ్మెల్యే పోచారంకు రాఖీ కట్టిన సోదరిమణి దొడ్ల సత్యవతి   •   విద్యుత్ పోరాట అమరవీరుల స్పూర్తితో భవిష్యత్ పోరాటాలు   •   ప్రయాణికుల కష్టాలు తీర్చేలా ఆర్‌ఓబీ పనులు వేగవంతం చేయాలి   •   సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు   •   మదర్‌ థెరిసా పొదుపు సమితిపై ఆరోపణల కలకలం   •   పేద విద్యార్థులకు డాక్టర్ సంతోష్ రెడ్డి ఆర్థిక సహయం   •   జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •  

నేరాల కట్టడికే కార్డన్‌ సెర్చ్‌

29-06-2025 01:17 AM

సర్కిల్ ఇన్స్పసెర్చ్‌ నాగబాబు

మణుగూరు,(విజయక్రాంతి): నేరాల కట్టడి కోసమే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామని మణుగూరు సర్కిల్ ఇన్స్పెక్టర్  నాగబాబు తెలిపారు. శనివారం డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆదేశాలతో మండల పరిధిలోని రేగుల గండి వలస  ఆదివాసి గ్రామంలో పోలీసు సిబ్బందితో ఆయన కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలపై ఆరా తీశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. కార్డన్‌ సెర్చ్‌ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమే అన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. చట్టవిరుద్ధ కార్యకలపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.