13-11-2025 12:44:19 AM
సరైన పత్రాలులేని 71 వాహనాలు స్వాధీనం
మనోహరాబాద్, నవంబర్ 12 :ప్రజా భద్రత, నేరాల నివారణ, పోలీసు-ప్రజల న మ్మకం పెంపు కోసం కమ్యూనిటీ కనెక్ట్ విత్ పీపుల్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం తూప్రాన్ ఎస్డీపీఓ నరేందర్ గౌడ్ పర్యవేక్షణలో తూప్రాన్ సీఐ రంగ క్రిష్ణ, ఎస్‌ఐ సు భాష్ గౌడ్ మనోహరాబాద్ ఎస్‌ఐ సమన్వయంతో నిర్వహించడం జరిగింది.
ప్రజల్లో పోలీసులపై నమ్మకం, భరోసా పెంపొందించడం నేరాలు, మత్తు పదార్థాల వినియోగం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాగా గ్రామంలోని అన్ని వీధులు, ఇళ్లు, షాపులు, అను మానాస్పద ప్రదేశాలను పూర్తిగా తనిఖీ చే యడం జరిగింది. సరియైన పత్రాలు లేని 67 టూ-వీలర్లు, 4 ఫోర్-వీలర్లు తనిఖీల్లో స్వాధీన పర్చుకున్నట్లు డీఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు.