13-11-2025 12:42:52 AM
మనోహరాబాద్, నవంబర్ 12 :మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామం లో నిర్వహించిన కమ్యూనిటీ కనెక్ట్ విత్ పీపు ల్ కార్యక్రమం సందర్భంగా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అతన్ని ప్రశ్నించగా తన పేరు సుగూరు రా మానాయుడుగా, నంద్యాల జిల్లా ప్యాపలి మండలం ఓబుల దేవరపల్లి గ్రామంగా తెలిపారు.
అతని పూర్తిగా విచారించగా తన కు టుంబ సభ్యులతో గొడవ కారణంగా స్వ గ్రామం విడిచి ఇక్కడకు వచ్చినట్లు తెలిసిం ది. వెంటనే పోలీసులు వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. అనంతరం ఆయన తండ్రి వెంకటేష్ నంద్యాల నుండి మనోహరాబాద్ వచ్చి తన కుమారుడిని తీసుకొని వెళ్ళడం జరిగిందని పోలీసులు తెలిపారు.