13-11-2025 12:46:07 AM
అధికారుల తీరుపై సింగూరు బాధితుల ఆగ్రహం
మునిపల్లి, నవంబర్ 12 :మండల పరిధిలోని మల్లారెడ్డిపేట గ్రామ శివారులో గల సింగూరు ప్రాజెక్టు సమీపంలో ముంపుకు గురైన భూములు కబ్జాకు గురవుతున్నాయ ని మల్లారెడ్డిపేట గ్రామ మాజీ సర్పంచ్ శివజ్యోతి, మాజీ ఉప సర్పంచ్ రాజు, గ్రా మస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం ఇరిగేషన్ డీఈఈ నాగరాజు, ఏఈ అఖిల, సర్వేయర్ సునీత, ఆర్‌ఐ సుభాష్, గ్రామ పరిపాలన అధికారి రాజు తదితరులు ముంపు భూముల్లో సర్వే చేసేందుకు వెళ్లా రు. అక్కడ ఎంత భూమి ఉంది.. ఎంత వరకు ఉంది..
అని తేల్చలేకపోయారు. ఇదం తా తేలాలంటే సింగూరు ప్రాజెక్టు అధికారులు తప్పని సరిగా రావల్సి ఉంటుం ది..అందుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చేసేదేమి లేక వెళ్లిపోయారు. దీంతో అధికారుల తీరుపై గ్రామస్తులు తీవ్రస్థాయి లో ఆగ్రహించారు. కాగా సింగూరు ప్రాజెక్టు అధికారులు రెండు, మూడు రోజుల్లో సర్వే చేస్తారని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చెప్పారు.