calender_icon.png 5 November, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

05-11-2025 12:00:00 AM

అలంపూర్ నవంబర్ 04:అలంపూర్ మండల పరిధిలోని క్యాతూరు పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొను గోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వం మొక్కజొన్న పంటను క్వింటా రూ.2400 చెల్లిస్తుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ ,సింగిల్ విండో అధ్యక్షులు రాఘవరెడ్డి ,భీమవరం చంద్రశేఖర్ రెడ్డి ఉట్కూరు నరసన్న గౌడ్, శ్రీకాంత్,మద్దిలేటి రమణ ,నరేంద్ర తదితరులు పాల్గొన్నారు,