05-11-2025 12:00:00 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, నవంబర్ 4 (విజయక్రాంతి): ప్రజలు ఆశీర్వదించినందుకు వారి రుణం తీర్చుకునే శాయశక్తులుగా అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
మాయ మాటలు చెప్పి కాలం గడిపే అవసరం తమకు లేదని చేస్తున్న అభివృద్ధి చేయబోతున్న వాస్తవాలను మాత్రమే ప్రజల ముందు ఉంచుతున్నానని తెలిపారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కల్పించేందుకుగాను రూ 603 కోట్లు మంజూరు కావడం జరిగిందని స్పష్టం చేశారు. నీటి సరఫరాకు రూ 220.94 కోట్లు మంజూరు కావడం జరిగిందని ప్రతి పనిని పారదర్శకంగా ముందుకు తీసుకుపోతున్నామని తెలియజేశారు.
రాజకీయాల్లోకి ఎమ్మెల్యేను, ఎంపీని అయితానేమోనని రాలేదన్నారు. బ్రహ్మాండమైన ఉద్యోగం చేస్తూ జీవనం గడిపే నాకు తెలంగాణ మలి దశ ఉద్యమం లో భాగస్వామ్యం కావాలని ఉద్దేశంతో వచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం న్యూ ప్రేమ్ నగర్, ఇండస్ట్రయల్ ఏరియాలో అయ్యప్ప స్వాముల కోసం అన్నప్రసాద క్షేత్రాన్ని ముడా నిధులతో నూతనంగా నిర్మించారు.
ఎమ్మెల్యే మంగళవారం అయ్యప్ప స్వాములు అన్నప్రసాద క్షేత్రాన్ని సందర్శించారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, ఎన్పీ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, మత్స్య శాఖ పర్సన్ ఇంచార్జ్ గోనెల శ్రీనివాస్, బెనహర్ తదితరులు ఉన్నారు.