14 July, 2026 | 6:43 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

ఏరియాను సందర్శించిన కార్పొరేట్ జిఎం(ఆర్ అండ్ డి) నారాయణ రావ్

26-06-2025 08:24 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్పొరేట్ కార్యాలయం(Singareni Corporate Office)లో జిఎం (ఆర్ అండ్ డి)గా విధులు నిర్వహిస్తున్న నారాయణరావు గురువారం ఏరియాను సందర్శించారు. ఏరియా పర్యటనకు వచ్చిన ఆయనను ఏరియా జిఎం జి దేవేందర్ ఘన స్వాగతం పలికారు. ఈనెల 30న పదవీ విరమణ పొందనున్న ఆయనను జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం మాట్లాడుతూ... సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న ప్రతి అధికారికి పదవీ విరమణ తప్పదని అన్నారు. పదవి విరమణ అనంతరం వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో సాగాలని ఆయన ఆకాంక్షించారు.

బదిలీపై వెళ్తున్న అధికారికి...

సింగరేణి ఏరియా ఫారెస్ట్ మేనేజర్ గా విధులు నిర్వహించి బదిలీపై కొత్తగూడెం వెళ్తున్న ఆర్ రమణారెడ్డి ని ఏరియా జిఎం జి దేవేందర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ.. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు బదిలీలు సహజమని అధికారులు తమ పని చేసిన ప్రదేశాల్లో కార్మికుల అధికారుల ఆదరాభిమానాలు పొందాలని కోరారు. ఫారెస్ట్ అధికారిగా ఏరియాకు అందించిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ ఓ టు జిఎం విజయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఎస్ఇ ఐఇడి కె కిరణ్ కుమార్, డీజీఎం ఎఫ్ & ఎ ఆర్విఎస్ఆర్కె ప్రసాద్, పర్చేస్ అధికారి బాబు, ఏరియా అధికారులు పాల్గొన్నారు.