25-05-2025 12:52:46 AM
కుత్బుల్లాపూర్, ఖానాపూర్, మే 24: జగద్గిరిగుట్ట పీఎస్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వ హిస్తున్న శంకర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సౌండ్ పొల్యూషన్‌కు పాల్పడుతున్నాడంటూ జగద్గిరిగుట్టలో హరికమల్ పాడ్ బ్యాండ్ అనే డీజే నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై కొద్దిరోజుల కింద కేసు నమోదైం ది. దీంతో డీజే సౌండ్ సామాగ్రిని పోలీసు లు సీజ్ చేశారు.
వీటిని తిరిగి ఇచ్చేందుకు సదరు ఎస్‌ఐ రూ.15 వేలు లంచం డిమాం డ్ చేశాడు. దీంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, ఎస్‌ఐ శంకర్‌ను అదు పులోకి తీసుకుని విచారించారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో రెవెన్యూ సర్వేయర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
సర్వేయర్ పవర్ ఉమాజీ ఇటీవల గంగాపూర్ గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్ వద్ద తన ఐదు ఎకరాల భూమిని సర్వే చేసేందుకు లంచం రూ.25,000 డిమాండ్ చేయగా, ఇద్దరి మధ్య రూ.20 వేలకు ఒప్పందం కుదిరింది.
కాగా ప్రభాకర్ ఇదివరకే రూ.12 వేలు చెల్లించాడు. మిగిలిన రూ.8 వేలు చెల్లించాలని ఒత్తిడి చేయగా, సదరు రైతు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచనల మేరకు రూ.7 వేల నగదును సమకూర్చుకొని, సర్వేయర్‌కు అందించగా, ఏసీబీ అధికారులు అడ్డుకున్నారు.