calender_icon.png 25 May, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హానర్ హోమ్స్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌కు వన్నెతెచ్చిన మిస్‌వరల్డ్ పోటీదారులు

25-05-2025 12:56:47 AM

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): సాంస్కృతిక వారసత్వాన్ని, అంతర్జాతీయ స్నేహబంధాన్ని ఘనంగా చాటుతున్న మిస్ వరల్డ్  2025 పోటీదారులకు, భారతదేశపు అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్‌పీరియన్స్ హబ్ (65వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉం ది) ‘హానర్ హోమ్స్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ఆతిథ్యమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన పోటీదారులకు హానర్ హోమ్స్ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికింది.

ఈ సందర్భంగా అందాలభామలు హానర్ హోమ్స్ వారి విశాలమైన వెల్‌కమ్ గ్యాలరీ, కనెక్ట్ డెస్టినేషన్, హానర్ సిగ్నాటిస్ మోడల్ అపార్ట్‌మెంట్లు, విజన్ హబ్‌లను సందర్శించా రు. అనంతరం తెలంగాణ సంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించే అద్భుత సాంస్కృతిక ప్రదర్శనను ఆస్వాదించారు.

ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి హానర్ హోమ్స్ వారు  కృతజ్ఞతలు తెలియజేశారు. గ్లోబల్ ఈవెంట్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి న పాలకుల దూరదృష్టిని, నిబద్ధతను ప్రశంసించారు. కార్యక్రమంలో హానర్ హోమ్స్ సహ-వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్లు ఎస్ రాజమౌళి, పీ వెంకటేశ్వర్లు, ఎం బాలుచౌదరి, వై స్వప్నకుమార్ ప్రతినిధులను హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘మిస్ వరల్డ్ పోటీకి హైదరాబాద్ ఆతి థ్యం ఇవ్వడం గొప్ప విషయంగా భావిస్తు న్నాం. ఈ సందర్భంగా మా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించిన అందాలరాణులకు మన రాష్ట్ర సంస్కృతి, వారసత్వాన్ని చూపించే అవకాశం లభించింది. హానర్ హోమ్స్ కుటుం బం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోటీ అధికారులు, గౌరవ అతిథులు పాల్గొని- లక్ష్యసాధన, స్ఫూరి, అంతర్జాతీయ ఐక్యతా భా వంతో జయప్రదంగా వేడుకను ముగించారు.