20-08-2025 01:38:35 AM
- ఆమనగల్లులో తహసీల్దార్, సర్వేయర్
- తాండూరులో మున్సిపల్ అసిస్టెంట్
ఆమనగల్, ఆగస్టు 19: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ తహసీల్దార్ లలిత, సర్వేయర్ రవి, ఇదే జిల్లాలోని తాండూరు మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ రమేష్ మంగళవారం లంచం తీసుకుంకూ ఏసీబీకి చిక్కారు. ఆమనగల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు తమ పట్టాదారు పాసుపుస్తకంలో పేర్ల నమోదు కోసం తహసీల్దార్ లలితను ఆశ్రయించాడు. అందుకు ఆమె రూ.లక్ష డిమాం డ్ చేసింది. బాధితుడు ఒప్పుకోగా ఆమె సూ చనల ప్రకారం ధరణి ఆపరేటర్‌కు రూ.50 వేలు ఇచ్చాడు.
అయినా పని పూర్తి కాకపోవడంతో మళ్లీ తహసీల్దార్‌ను బాధితుడు ఆశ్రయించగా తహసీల్దార్ రూ.50 వేలు, సర్వేయర్ రవి రూ.50 వేలు డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు.. తహసీల్దార్, సర్వేయర్‌తో ఫోన్లో మాట్లాడిన పూర్తి సంభాషణలను ఏసీబీ అధికారులకు అందజేశాడు. కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్.. ఆధారాలతో మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి, కందుకూర్ ఆర్డీవో జగదీశ్వర్ సమక్షంలో విచారణ చేపట్టి.. ఎమ్మార్వో లలిత, సర్వేయర్ రవిని అదులోకి తీసుకున్నారు.
తాండూరులో సీనియర్ అసిస్టెంట్..
తాండూరు (విజయక్రాంతి): తాండూర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి నంబర్ మంజూరు కోసం మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ రమేష్ రమేష్‌ను సంప్రదించగా రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలోనే రూ.15 వేల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ రమేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.