20-08-2025 11:20:21 AM
రైతులకు సంఘీభావం తెలిపిన టిఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు బాస్ హనుమంతు నాయుడు
గద్వాల : యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు యూరియా అత్యవసరమైంది అయితే గత నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గరకు యూరియా కోసం రైతులు తిరుగుతున్నారు ప్రతిరోజు అధికారులు యూరియా లేదని త్వరలో వస్తుందని చెప్తూ రైతులను మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నారు దీంతో ఆగ్రహించిన రైతులు బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందున్న ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ నాయకుడు బాసు హనుమంతు నాయుడు రైతులకు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి ఎరువుల కొరత లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి రైతులకు కష్టాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన యూరియా ప్రభుత్వం సరఫరా చేయాలని లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు ధర్నా దగ్గరికి చేరుకున్న పోలీసులు రైతులతో మాట్లాడి వారిని శాంతింప చేశారు. రైతులందరికీ యూరియా అధ్య విధంగా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేయడంతో వారు ధర్నా విరవించి వెళ్ళిపోయారు