20-08-2025 11:56:17 AM
మహబూబ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): దేశం సంక్షేమమే తన లక్ష్యంగా అడుగులు వేసిన స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ(Rajiv Gandhi birth anniversary ) సేవలు ఎల్లప్పుడూ పదిలంగా ఉంటాయని మహబూబ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ గ విగ్రహానికి మాజీ కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాలవేసి, అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబెదుల్లా కొత్వాల్ తో కలిసి మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ని ఆదర్శంగా తీసుకుంటూ, యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. ఆనాటి పునాదుల్లో నేడు దేశ పురోగతిని టెక్నాలజీని మనం గమనిస్తున్నామన్నారు. నాడు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ స్వాతంత్రంలోమహాత్మా గాంధీ, నెహ్రూచేసినటువంటి కృషి, వారు తీసుకొచ్చిన సంస్కరణలను ముందుకు కొనసాగిస్తూ దేశ పురోగతికి ఎనలేని సేవలు చేసిన రాజీవ్ గాంధీ ని స్మరించుకుంటూ ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ యాడ్ చైర్పర్సన్ బెక్కరి అనిత, సిరాజ్ ఖాద్రి, చంద్రకుమార్ గౌడ్, సంజీవ్ ముదిరాజ్, ఫయాజ్,అవీజ్, ఆజ్మాత్, మాజీ కౌన్సిలర్ చిన్న, మునీర్, జాజిమొగ్గ నరసింహులు, మోతిలాల్, ప్రశాంత్, తిరుమల వెంకటేష్, ఉమర్ మరియు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.