20-08-2025 11:18:42 AM
ఐటీడిఏపి ఓ రాహుల్
భద్రాచలం (విజయ క్రాంతి): గోదావరి నది పరివాహక లోతట్టు వరద ముంపునకు గురి అయ్యే గిరిజన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికా బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains) కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 43 అడుగులకు చేరుకున్నందున మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినందున ఎగవ కురుస్తున్న వర్షాలకు గోదావరి క్రమేపీ పెరుగుతూ ఉదృతంగా ప్రవహిస్తున్నందున, గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత గిరిజన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
అత్యవసరమైతేతప్ప బయటికి రావద్దని సూచించారు.గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వాగులు,వంకలు పొంగిపొర్లు తున్నాయని అన్నారు.ఉదృతంగా ప్రవహిస్తున్న చెరువులు,వాగులు,వంకల వద్దకు వీడియోల కోసం,సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు.వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదివే గిరిజన విద్యార్థినీ విద్యార్థులు పొంగుతున్న వాగులు, చెక్ డ్యాముల వద్దకు వెళ్లకుండా చూడాలని అన్నారు.
గోదావరి నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులు వరద ముంపునకు గురి అయితే వెంటనే అధికారుల సూచనలు పాటించి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అన్నారు. అత్యవసరమైన విపత్కరమైన పరిస్థితులు ఏమైనా ఉంటే వెంటనే సంబంధిత కంట్రోల్ రూమ్ నంబర్లు భద్రాద్రి కొత్తగూడెం@పాల్వంచ 08744-241950,(వాట్సాప్) 93929 19743, ఐటీడీఏ భద్రాచలం కంట్రోల్ రూమ్ నెంబర్ 799 5268 352, సబ్ కలెక్టర్ ఆఫీస్, భద్రాచలం 08743-2324444, (వాట్సాప్) 93479 10737 నంబర్లకు ఫోన్ ద్వారా తెలియజేయాలని ఆయన కోరారు.