20-08-2025 01:39:57 AM
వనస్థలిపురంలో ముగిసిన రోలర్ స్కేటింగ్ పోటీలు
ఎల్బీనగర్, ఆగస్టు 19 : క్రీడారంగంలో క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, మన క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటి, తెలంగాణకు పేరుప్రఖ్యాతులు తేవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. వనస్థలిపురం స్కేటింగ్ రింగ్ లో మొదటి తెలంగాణ రోలర్ స్కేటింగ్ అండ్ ఇన్లైన్ హాకీ ఇండిపెండెన్స్ కప్ పోటీలు ముగిశాయి. ఎమ్మెల్యే శదేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు మెడల్స్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటగాళ్లలో ఉన్న ప్రతిభను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని జాతీయ,అంతర్జాతీయ స్థాయిల్లో మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వనస్థలిపురం స్కేటింగ్ రింగ్ ను ఇండోర్ రింగుగా మార్చడానికి తన వంతు కృషి చేస్తానని,అన్ని సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆర్గనైజింగ్ చైర్మన్ టంగుటూరి నాగరాజు, జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ స్పాన్సర్ జక్కిడి రఘువీర్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి, తెలంగాణ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ, రంగారెడ్డి జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మనోహర్, గడ్డిఅన్నారం మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ టంగుటూరి నాగరాజు, బీఆర్‌ఎస్ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి, ఈవెంట్ అఫీషియల్స్ శ్రీను, అజయ్, అబూద్ ఖురేషి, సత్యం, అభిలాష్, నాగరాజు, రాజు, ముస్తఫా, అహ్మద్, ప్రవీణ్, అహ్మద్ తదితరులుపాల్గొన్నారు.