calender_icon.png 20 August, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణం.. ప్రాణ సంకటం..

20-08-2025 11:49:14 AM

పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై భారీ గుంత.

రేగొండ,(విజయక్రాంతి): పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి (నేషనల్ హైవే 353 సి) పై భారీ గుంత ఏర్పడి ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. రేగొండ నుండి రూపిరెడ్డి పల్లె మధ్యలో గంగరాయి చెరువుకుంట దగ్గర్లో ఈ భారీ గుంత ఏర్పడి నీళ్లు నిలిచాయి. దీంతో ప్రయాణికులు ఆదమరచి ప్రయాణిస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. భారీ గుంతలు ఏర్పడిన రహదారులపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతుందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారులపై కొత్తగా ప్రయాణించే వాహనదారులు ఈ గుంతల పై అవగాహన లేక ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని కనీసం గుంతలు పూడ్చడం పైన అయినా అధికారులు దృష్టిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.