20-08-2025 11:22:08 AM
హుజురాబాద్,(విజయక్రాంతి): యువ తెలంగాణ కబడ్డీ ఛాంపియన్స్ ట్రోఫీకి( Kabaddi Championship Trophy) హుజురాబాద్ చెందిన కబడ్డీ క్రీడాకారుడు తూర్పాటి భూపతి రాజు ఎంపికైనట్లు హుజురాబాద్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో లోని హైస్కూల్ క్రీడా మైదానంలో బుధవారం తూర్పాటిరాజును సీనియర్ క్రీడాకారులు శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘము నిర్వహిస్తున్న చాంపియన్స్ ట్రోఫీలో తూర్పాటి భూపతి రాజ్ భద్రాద్రి గ్రేప్స్ జట్టుకు ఎంపికైనట్లు తెలిపారు. హుజురాబాద్ కి చెందిన కబడ్డీ క్రీడాకారుడు ఎంపిక ఆవ్వడం ఎంతో ఆనందంగా ఉందని. భూపతి రాజు స్ఫూర్తితో క్రీడాకారులు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సునీల్ రెడ్డి, గండ్ర సమ్మిరెడ్డి, రవీందర్, నీరటి రమేష్, కేసారయ్య, కేమహేష్, సతీష్ వర్మ, బాలకృష్ణ తో పాటు తదితరులు సన్మానించారు.