ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని అంతం చేయాలి
31-05-2024 01:27 AM
ఉద్యోగులను అభినందించిన ఏసీబీ డీజీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో గురువారం ఏసీబీ కార్యాలయంలో త్రైమాసిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా పనిచే స్తున్న ఏసీబీ సిబ్బందిని ఆయన అభినందించారు. 2024 ఏప్రిల్, మే నెలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన హోంగార్డులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో సహా 220 మంది అధికారులు, ఉద్యోగులకు నగదుతో పాటు ప్రశంస పత్రాలను అందజేశారు. రాబోయే రోజుల్లో మరింత కృషి చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతిని అంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఏఆర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.






