25 July, 2026 | 9:42 PM

సమ్మర్ కోచింగ్ క్యాంప్ సూపర్ సక్సెస్

31-05-2024 01:29 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏప్రిల్ 25 నుంచి కొనసాగుతున్న సమ్మర్ కోచింగ్ క్యాంపునకు క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభించినట్లు స్పోర్ట్స్ విభాగం డైరెక్టర్ కె. ఆదిలక్ష్మీ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 6 జోన్లలో 6 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య వయసు గల క్రీడాకారులను, క్రీడల పట్ల ఆసక్తి ఉండే విద్యా ర్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాన్ని ఈ నెల 30 నుంచి జూన్ 10వ తేదీ వరకూ పొడిగించామన్నారు. మొత్తం 44 క్రీడాంశాల్లో ఈ శిక్షణ జరుగుతుందని అన్నారు. ఈ వేసవి శిక్షణకు 2022లో 18,816 మంది హజరవ్వగా 2023లో 42, 214 మంది శిక్షణ పొందినట్టు తెలిపారు. ఈ ఏడాది 52,158 మంది శిక్ష ణ పొందుతున్నట్టు పేర్కొన్నారు. శిక్షణా శిబిరానికి నమోదు చేసుకున్న విద్యార్థుల నుంచి రూ. 7.99 లక్షల ఫీజు వసూలైనట్టు ఆదిలక్ష్మీ పేర్కొన్నారు.