రాజన్న ఆలయంలో అవినీతి

26-04-2024 01:33:59 AM

విజిలెన్స్ నివేదికతో  13 మంది అధికారులపై చర్యలు

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 25 (విజయక్రాం తి): రాష్ట్రంలోనే ప్రఓముఖ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో చర్యలు తీసుకోవడం ఉద్యోగ వర్గాల్లో ఆం దోళన రేకెత్తిస్తున్నది.  అధికారులు, సిబ్బందిపై 2021లో అవినీతి ఆరోపణలతో విజిలె న్స్ అధికారులు దాడులు చేశారు. తాజాగా  విజిలెన్స్ నివేదిక అందించడంతో వివిధ విభాగాల్లోని 13 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు ఏఈవోలకు ఏడాదిపాటు ఇంక్రిమెంట్లు నిలిపివేశారు. నలుగురు పర్యవేక్ష కులు, సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియ ర్ అసిస్టెంట్లు, ఇద్దరు పొరుగుసేవల సిబ్బం ది, నాయి బ్రహ్మణుడిపై చర్యలు తీసుకున్నా రు.  లడ్డూ విభాగంలోని పర్యవేక్షకుడికి రూ. 1.88 లక్షలు, అదే విభాగానికి చెందిన జూనియర్ అసిస్టెంట్ రూ.80 వేలు 15 రోజుల్లోపు ఆలయ ఖజానాకు జమచేయాలని ఆదేశించడంతోపాటు ఇంక్రిమెంట్ ఎందుకు నిలుపదల చేయరాదో సమాధానం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గోదాంలో సరుకుల నిల్వలో రూ.21 వేలు తేడా రావడంతో అవి చెల్లించాలని ఆదేశించారు. నందీశ్వర వసతి గదుల సముదా యంలో అద్దెగదిని రెన్యూవల్ చేయని ఒప్పంద ఉద్యోగిపై చర్యలు తీసుకున్నారు. ఇదే విభాగానికి చెందిన పలువురు పర్యవేక్షకులు, జూనియర్ అసిస్టెంట్లు విధుల్లో  నిర్లక్ష్యంగా వ్యవహారించారంటూ ఇంక్రిమెం ట్ నిలిపివేశారు. భక్తుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసిన నాయి బ్రాహ్మణుడిని తొలగించాలని ఆదేశించారు.