28 March, 2026 | 5:41 AM

హైదరాబాద్‌లో భారీ వర్షం

16-05-2024 03:41 PM

హైదరాబాద్, సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాత్లో గురువారం మధ్యాహ్నం భారీ పడుతోంది. జూబ్లీహిల్స్ , పంజాగుట్ట, మణికొండ, అమీర్ పేట్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, బాచుపల్లి, బోయిన్ పల్లి, మారేడు పల్లి, బేగంపేట్, ప్యారడైజ్, చిలకలగూడ, అల్వాల్, జవహర్ నగర్, మల్కాజ్ గిరి, నేరెడ్ మెంట్, నాగారం, కుత్భుల్లాపూర్, చింతల్, షాపూర్ నగర్, గాజులరామారం, సూరారం, బహదూర్ పల్లిలో జోరుగా వర్షం కురుస్తోంది. వర్షం కురవడంతో వాహనదారులు ఎక్కడి వారు  అక్కడ ఆగిపోయారు. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

అటు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 19న అండమాన్ తీరాన్ని తాకనున్నాయని తెలిపింది. నెలాఖరులో కేరళను  నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత వారంలో ఏపీలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశించనున్నాయి. ఉపరితల ఆవర్తనం ,ద్రోణి ప్రభావంతో కేరళ, తమిళనాడులో వర్షాలు పడనున్నాయి.  కోస్తాంధ్ర, సీమ జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు.. గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.