calender_icon.png 20 August, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాటర్ షెడ్ పథకంలో అవినీతిపై విచారణ జరపాలి

19-08-2025 11:53:52 PM

డివైఎఫ్ఐ ,కెవిపిఎస్ సంఘాల డిమాండ్

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా వాటర్ షెడ్ పథకంలో చేపట్టిన పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ, కెవిపిఎస్ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ... వాటర్ షెడ్ పథకంలో చేపట్టిన పనుల్లో ఇంటి దొంగలు ఉన్నారని తెలిసినప్పటికీ సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు.

అవినీతి అక్రమాలలో పాత్ర ఉన్న ఏపీఎం, సీసీల నుండి  డబ్బులు రికవరీ చేయకుండానే డిఆర్డిఓ వారికి వత్తాసు పలుకుతూ సస్పెండ్ అయినవారికి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు. అవినీతిలో అందరి భాగస్వామ్యం ఉందని బహిరంగంగా చర్చ జరుగుతుందని తెలిపారు.