20-08-2025 12:00:00 AM
సంతృప్తి వ్యక్తం చేసిన కంచి పీఠాధిపతి
గజ్వేల్, ఆగస్టు19: కంచి పీఠం ఆధ్వర్యంలోని వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్ర నిర్వాహణ, పనితీరు అద్భుతంగా ఉందని కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతి క్షేత్రంలోని మహా పాదుకా కంచి మఠంలో చతుర్మాస్య దీక్షలో ఉన్న స్వామివారిని మంగళవారం వర్గల్ క్షేత్ర వ్యవస్థాపక చైర్మన్, బ్రహ్మశ్రీ, యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో అభివృద్ధి కమిటీ సభ్యులు స్వామివారిని కలిసి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా వర్గల్ విద్యాసారథి క్షేత్రంలో శ్రీ శారద స్మార్త వేద విద్యాలయం, క్షేత్ర నిర్వహణ, చేపడుతున్న నిర్మాణాలు, అభివృద్ధి పనులు, భవిష్యత్తు ప్రణాళిక తదితర కంచి స్వామివారికి వివరించారు. అలాగే సెప్టెంబర్ 22వ తేదీ నుండి ప్రారంభం కానున్న శ్రీ విద్యాధరి శరన్నవరాత్ర మహోత్సవాల నిర్వహణకు అనుమతి పొందుతూ స్వామి వారిని ఆహ్వానించారు. శ్రీ కంచి పీఠం ఉత్తరాధికారి శ్రీ సత్య చంద్ర శేఖర సరస్వతి స్వామివారి పరిచయ కార్యక్రమం నిర్వహించగా, వర్గల్ ఆలయం భక్తులకు చక్కటి వసతులు కల్పిస్తూ, గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లాలని ఆకాంక్షించారు.