calender_icon.png 20 August, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ బిల్లులు ఏకమొత్తంలో చెల్లించాలి

20-08-2025 12:00:00 AM

ఎస్‌టీయూ

తిమ్మాపూర్ ఆగస్టు 19 విజయ క్రాంతి:ఉపాధ్యాయుల దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిఆర్ శ్రీనివాస్, కట్టా ర వీంద్ర చారిలు ప్రభుత్వాన్ని మంగళవారం కోరారు. దీర్ఘకాలికంగా మెడికల్ రియంబర్స్మెంట్, జిపిఎఫ్, సరెండర్ లీవ్, టి ఎస్ జి ఎల్ ఐ బకాయిలు, పెన్షనరీబెనిఫిట్స్ తదితరాలకు సంబంధించి కోట్లాది రూపాయల బిల్లులు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని వెంటనే వాటిని మం జూరు చేయాలని డిమాండ్ చేశారు.

మంగళవారం తిమ్మాపుర్ మండలంలోని అలుగునూర్ పాఠశాలలో ఎస్టీయూ సంఘ సభ్యత్వ క్యాంపెయిన్ నిర్వహించి ఉపాధ్యాయుల నుండి సభ్యత్వం స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మెరుగైన పిఆర్సి ని అమలు పర చాలని పెండింగ్ లో ఉన్నటువంటి నాలుగు డీఏలను సత్వరం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్ర భుత్వం హామీ ఇచ్చిన పిఎస్ హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేసి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని కో రారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు కందుకూరి వివేకానంద చారి, మండల ,జిల్లా బాధ్యులు ఎండి రసూల్, రవీందర్, చంద్రశేఖర్, దాసరి సుభాష్, జగదీశ్వర్, హేమలత, తదితరులు పాల్గొన్నారు.