09-01-2026 12:00:00 AM
సీసీఐ కమార్షియల్ ఆఫీసర్ వరుణ్ రఘువీర్
మునిపల్లి, జనవరి 8: జిల్లా వ్యాప్తంగా సీసీఐ పత్తి కొనుగోలు శని, ఆదివారాలలో నిలిపివేస్తున్నట్లు సీసీఐ కమార్షియల్ ఆపీసర్ వరుణ్ రఘువీర్ గురువారం తెలిపారు. ఈ ప్రాంతంలోని జిన్నింగ్ మిల్లుల్లో పత్తి నిల్వలు విపరీతంగా పెరగడంతో రెండు రోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేస్తున్నామని ఆయన వివరించారు. తిరిగి సోమ, మంగళవారం లలో సీసీఐ కొనుగోళ్లు ప్రారంభమవుతాయి అన్నారు. ఆ తర్వాత పూర్తిగా సీసీఐ పత్తి కొనుగోళ్లు బంద్ చేస్తున్నట్లు తెలిపారు.
రైతులు విషయాన్ని గమనించి 2 రోజులు మార్కెట్కు పత్తిని తీసుకురావద్దని కోరారు. పత్తిని నిల్వ చేసుకున్న రైతులందరూ సోమ, మంగళవారాలకు స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో 10లక్షలు కాగా ఇందులో రాయికోడ్ మార్కెట్ లో 2లక్షల 60వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.