09-01-2026 12:00:00 AM
నంగునూరు, జనవరి 8: రైతుల సౌకర్యార్థం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నంగునూరు శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రత్యేక క్రాప్ లోన్ రెన్యువల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. బ్యాంక్ పరిధిలోని 9 సర్వీస్ గ్రామాల్లో ఈ నెల 23వ తేదీ వరకు ఈ క్యాంపులు కొనసాగుతాయని బ్యాంక్ మేనేజర్ కటికల అనిల్ తెలిపారు.గురువారం గట్లమల్యాలలో 142, కొండం రాజుపల్లిలో 71 మంది రైతులకు బ్యాంక్ అధికారులు నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే రుణాలను రెన్యువల్ ప్రక్రియ చేపట్టారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో రుణాలను రెన్యువల్ చేసుకోవాలని మేనేజర్ అనిల్ కోరారు.ఈ కార్యక్రమంలో ఫీల్ ఆఫీసర్ లక్విందర్ సింగ్, సర్పంచులు ఇంగే నరేష్, సిల్వేని అరుణ భాయ్,ఉప సర్పంచులు తిప్పని శ్రీనివాస్, పిట్టల మమత వార్డు సభ్యులు,బ్యాంక్ సిబ్బంది సంపత్ కుమార్, భూపతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.