22 June, 2026 | 7:39 PM

అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ పాటి పావని జగన్మోహన్ రెడ్డి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం

22-06-2026 06:17 PM

మొయినాబాద్,(విజయక్రాంతి): మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళారం గ్రామ జడ్‌పీహెచ్‌ఎస్ ప్రైమరీ పాఠశాలలో నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో కౌన్సిలర్ పాటి పావని జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి వారి విద్యాభ్యాసానికి శుభారంభంపలికారు. అనంతరం పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన కౌన్సిలర్, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యంగా ఉందని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన కౌన్సిలర్, విద్యను జీవితంలో అత్యంత విలువైన ఆస్తిగా భావించి క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.